KMM: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ఉదయం 10:30 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాబోయే వానాకాలం(ఖరీఫ్) సాగు కార్యాచరణ ప్రణాళిక, సాగునీటి విడుదల, పౌరసరఫరాల ఏర్పాట్లపై ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.