అన్నమయ్య: ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని PTM, PHC డాక్టర్, తంబళ్లపల్లి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆరోగ్య సిబ్బందితో కలిసి కందుకూరు PHC పరిధిలోని నిలువు రాతిపల్లెలో రోడ్డుపై ప్రవహిస్తున్న మురికినీటిని పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది చేత శుభ్రం చేయించి దోమల వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ చల్లించారు.