సత్యసాయి: జిల్లా పోలీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం-1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి SP సతీశ్ కుమార్, ASP అంకితా సూరన హాజరయ్యారు. బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలపై అవగాహన అవసరమని ఎస్పీ తెలిపారు. వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి రక్షించడం సమాజ బాధ్యతని వెల్లడించారు.