ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ టీచర్స్ కాలనీ వద్ద డ్రైనేజీ ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోవడం ద్వారా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మంగళవారం తెలిపారు. డ్రైనేజీ ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోవడం ద్వారా మురుగునీరు వెళ్ళక, వృద్ధులు, చిన్నపిల్లలు తరచూ అనారోగ్య పాలవుతున్నామన్నారు. దీనిపై అధికారులకు చెప్పిన పట్టించుకోవటం లేదని వాపోయారు.