NTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. బూత్ స్థాయి నుంచి పకడ్బందీగా ఓటరు నమోదు, సవరణ చేపట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు.