NLG: చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెంలో విషాదం నెలకొంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్కు గురై కన్నెబోయిన పావని (28) అనే వివాహిత మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అకాల మరణంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. గత రెండేళ్ల కిందనే వివాహమైందని గ్రామస్తులు తెలిపారు.