MNCL: జన్నారంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ జన్నారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజారాంరెడ్డి, సులువ జనార్దన్ కోరారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు స్థానిక సబ్స్టేషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో కొన్ని రోజులుగా విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.