MDCL: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దాదాపు 6 వేల మంది అతిథులు రానున్న నేపథ్యంలో మల్కాజ్గిరి పోలీసులు 1,140 మంది సిబ్బంది, 55 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆహ్వానితులు ఉదయం 7:30 గంటలకే పాస్‌లతో రావాలని కమిషనర్ బి.సుమతి సూచించారు.