NDL: డోన్ మండలం కామగనికుంట్ల సమీపంలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ప్రయాణిస్తున్న రైతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.