MDK: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జూన్ 2న కలెక్టరేట్లో జరిగే ఉత్సవాల్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం అమరవీరుల స్మరణ, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.