PDPL: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఆర్ఓ రాజేశ్వరి తెలిపారు. ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో’ భాగంగా జూన్ 1 నుంచి 12 వరకు నిర్వహించే పర్యావరణ వారోత్సవాలను కలెక్టరేట్లో మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం రాంపల్లి, ఏక్లాస్ పూర్ గ్రామాలలో పర్యావరణ అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు పాల్గొన్నారు.