BPT: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు.