AP: కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇక్కడకు వస్తున్నాయని MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. పోరాటాలతో VSP రైల్వే జోన్ సాధించుకున్నామని, త్వరలోనే మెట్రో కల కూడా సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. GVMC 8 వ వార్డు సాగర్‌నగర్‌లో NTR భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో MLA గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.