JGL: పొగాకు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పొగాకు నిషేధ దినోత్సవం- 2026 కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా వైద్య శాఖ అధికారి సుజాత ఆధ్వర్యంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.