AP: ఈ నెల 7 నుంచి 21 వరకు రాష్ట్ర స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న అమరావతిలో వెస్ట్ బైపాస్‌పై 25 వేల మందితో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం చేపడతామని, దీనిలో CM పాల్గొంటారని ప్రకటించారు. ఈ ఏడాది యోగాలో రెండున్నర లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని CM కోరినట్లు చెప్పారు. AP యోగా ప్రచార పరిషత్‌కు CM ఆమోదం తెలిపారన్నారు.