ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు వికలాంగుడిగా మారిన సంఘటన అత్యంత దారుణమని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి వీరభద్రం అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం వైరాలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.