కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బాలయోగి కాలనీలో డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో 300 ఇల్లు ఉన్నాయని, గత 30 ఏళ్లుగా డ్రైనేజీ సదుపాయం లేదని, చుట్టుపక్కల మురికి నీరు తమ ప్రాంతంలోకి వస్తుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.