TG: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆసిఫాబాద్ మండలం కొఠారి కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను రేవంత్ ప్రారంభించారు. మొత్తం రూ.112.4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు.