KRNL: చంద్రబాబు నాయుడుపై ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇవాళ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం ఖండించారు. రాజకీయంగా ఎదగడానికి టీడీపీనే అవకాశాలు కల్పించిందని ఆయన గుర్తు చేశారు. పార్టీలు మారిన వారు చంద్రబాబును విమర్శించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు.