BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా నూతన జిల్లా విద్యాధికారిగా బొల్లారం బిక్షపతి బాధ్యతలు చేపట్టారు. గతంలో నల్లగొండ జిల్లా విద్యాధికారిగా సేవలందిస్తూ బదిలీల్లో భాగంగా ఈ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు మండల విద్యాధికారులు, కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.