AP: పొగాకు రైతుల సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. NLR జిల్లా డి.సి.పల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మంచి దిగుబడి వచ్చినా సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోయామని రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని ఆనం హామీ ఇచ్చారు.