HNK: పేదలు, వలస కార్మిక కుటుంబాలు తమ ఆత్మీయుల అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రత్యేక వసతులు కల్పించే దిశగా చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దృష్టికి తీసుకెళ్లగా, సోమవారం ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి హన్మకొండ నగరంలోని పద్మాక్షి శివ ముక్తి ధామాన్ని పరిశీలించారు.