SRD: చౌటాకూర్ శివారులో రైతు శ్రీశైలం (50) చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా భూ తగాదాల కారణంగా మనస్థాపానికి గురైన శ్రీశైలం ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పుల్కల్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.