AP: చిత్తూరులో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. పూతలపట్టు, బంగారుపాళ్యంలో స్కానింగ్ సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో చంద్రశేఖర్పురంలోని ఓ ఇంట్లో స్కానింగ్ మెషీన్ను అధికారులు సీజ్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారయ్యారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు వసూలు చేసి స్కానింగ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.