JN: రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ ఐకేపీ కేంద్రం నుంచి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇతరులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.