SS: ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందుగానే ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారుల ఇంటివద్దకే అందిస్తున్నామని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. సోమవారం కొత్తచెరువులో లబ్ధిదారులకు పెన్షన్లు నగదును ఆమె అందజేశారు. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని పేర్కొన్నారు.