ఖమ్మం జిల్లాలో గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాత వివరాలను అధికారులు సోమవారం వెల్లడించారు. వేంసూరులో అత్యధికంగా 2.8 మి.మీ వర్షం పడగా పెనుబల్లి 2.4, మధిర 2.2, సత్తుపల్లి 1.8, ఖమ్మం అర్బన్, ఎర్రుపాలెం మండలాల్లో 1.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 11.6 మి.మీ వర్షం కురవగా, సగటున 0.6 మి.మీగా నమోదైందని తెలిపారు.