CTR: పుంగనూరులో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో సంఘ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గురు రాజారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘంలో నూతనంగా 5 మంది సభ్యులుగా చేరారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు.