VZM: బొబ్బిలిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు బొబ్బిలి MRO రామ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో తన సిబ్బందితో కలిసి వేగవతి నది తీర ప్రాంతాలైన పారాది, పెంట, అలజంగి, కారాడ వద్ద నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు.