AP: విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ బోర్డును కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని ఏఎస్ పేట రైల్వే ట్రాక్ వద్ద ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రామ్మోహన్ కొబ్బరికాయ కొట్టి మొక్క నాటారు. విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ప్రారంభమైందన్నారు. భారత రైల్వే వ్యవస్థలోనే అత్యంత కీలక రైల్వే జోన్ ఇది అని పేర్కొన్నారు.