దేశీయంగా విమాన ప్రయాణాలు తగ్గినట్లు విమానయాన నియంత్రణ సంస్థ DGCA గణాంకాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చిలో 1.44 కోట్ల మంది దేశీయ మార్గాల్లో ప్రయాణించగా, ఏప్రిల్లో ఈ సంఖ్య 1.38 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఏప్రిల్లో ప్రయాణించిన 1.43 కోట్ల మంది కంటే, ఈసారి 3.47% తగ్గారు. విమాన ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, విమాన టికెట్ల ధరలు పెరగడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.