CTR: తిరుపతి కపిలతీర్థం పుష్కరిణిలో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన పవిత్ర చక్రస్నాన వేడుక అత్యంత వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు, చక్రత్తాళ్వార్‌కు అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం వేడుకను నిర్వహించారు. స్వామివారి చక్రస్నానం దర్శించుకున్న వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.