W.G: తాడేపల్లిగూడెంలోని కొంతమంది అవినీతి అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐదు నెలల కాలంలోనే ఇరువురు అధికారులపై ఏసీబీ దాడి చేసి, ప్రత్యక్షంగా అదుపులోకి తీసుకున్న ఘటనలు ఉన్నాయి. అప్పట్లోనే మరిన్ని దాడులు నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు చెప్పకనే చెప్పారు. దీంతో కొంతమంది అవినీతి అధికారుల గుండెల్లో గుబులు నెలకొంది.