ఉమ్మడి వరంగల్ జిల్లాలో పింఛన్ లబ్ధిదారుల మృతుల గుర్తింపు సర్వే నేటి నుంచి జూన్ 15 వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ముఖ గుర్తింపు యాప్ ద్వారా జీవన ధ్రువీకరణ నమోదు చేస్తున్నారు. జిల్లాలో 7.11 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా నెలకు రూ.141 కోట్ల పంపిణీ జరుగుతోంది.