మహబూబ్నగర్ జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీబీఏ కోర్సు చదువుతున్న 11 మంది విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో హైదరాబాద్లో ఏడాది పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ పొందనున్నారు. శిక్షణ కాలంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందనుండగా, శిక్షణ పూర్తైన తర్వాత శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.