NDL: గుత్తేదారు నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటూ శనివారం అనిశా అధికారులకు పట్టుబడ్డ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంఛార్జ్ ఏఈ రమేష్ జైలుపాలయ్యారు. అటు, ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా విలువైన వస్తువులు, పత్రాలు లభించలేదు. ఆదివారం కర్నూలు అనిశా కోర్టులో న్యాయమూర్తి శ్రీవిద్య ఎదుట హాజరుపరచగా, రమేష్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించారు.