MBNR: జిల్లాలో రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆదివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. నూతన రాష్ట్ర వాషర్మెన్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ కుమార్, వైస్ ఛైర్మన్ బంగారు బాబులను డీసీసీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. తమ పదవీకాలంలో రజక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.