KDP: ప్రభుత్వ స్థలాలతోపాటు కబ్జా రాయుళ్లు వంకలను ఆక్రమిస్తున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేత రవిశంకర్ రెడ్డి అన్నారు. ఆదివారం శివానందపురం వినాయకగూడెం వంక ఆక్రమణలను పరిశీలించారు. బ్రిటిష్ కాలంనాటి ఈ వంకకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు.ఆధారాలతో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామని, అక్రమార్కులపై చర్యలు తీసుకునేదాకా పోరాటం కొనసాగుతుందన్నారు.