KRNL: పత్తికొండ మార్కెట్లో తొలిసారిగా ఆదివారం ముంత మామిడి పండ్లు దర్శనమివ్వడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇవి సాధారణ మామిడి పండ్ల కంటే పెద్ద పరిమాణంలో ఉండటంతో కొనుగోలుదారులు వ్యాపారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి నుంచి ఈ పండ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వ్యాపారి తెలిపాడు. కిలో రూ.100 ధరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి.