KMM: చింతకాని మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను సోమవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. మున్నేరు నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.