GNTR: వైద్య రంగంలో మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా రేపు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు సీపీఐ నేతలు అరుణ్, అంజిబాబు తెలిపారు. శుక్రవారం కొత్తపేటలో మాట్లాడుతూ..పేదలపై వైద్య భారం పెరిగిపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మాఫియా ఆగడాలు మితిమీరాయని విమర్శించారు. కావున మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా రేపు ప్రజా సంఘాలు తమ గళాన్ని వినిపించాలని కోరారు.