విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని DME కార్యాలయంలో నూతన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా డా. ఎ. విష్ణువర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. వైద్య విద్యా ప్రమాణాల అభివృద్ధి, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాణ్యమైన విద్య, ఆసుపత్రుల్లో మెరుగైన సేవలపై దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు. అధికారులు, వైద్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.