KRNL: పెద్దకడబూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి సహకారంతో శుక్రవారం తాగునీటి బోర్ వేయించారు. టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు గుమ్మల ఆశన్న, మంచోది బజారి, ఆదాం, బొగ్గుల ఇమ్మానియేల్, మంచోది బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోర్ వేశారు.