TG: ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు పేరుతో మిల్లర్లు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల, కేతేపల్లి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన పరిశీలించారు. కొనుగోళ్ల ఆలస్యంపై నిర్వాహకులపై మండిపడ్డారు. లారీలన్నింటినీ ధాన్యం తరలింపునకే వాడాలని సూచించారు.