సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అతిథి’ ఈరోజు థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయ్యింది. 4K డిజిటల్ వెర్షన్‌తో సరికొత్తగా ముస్తాబైన ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మహేష్ యాక్షన్ పవర్‌హౌస్ పర్ఫార్మెన్స్తో థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది.