రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక జట్టు ఇబ్బందుల్లో పడింది. మయాంక్ అగర్వాల్ (86*) రాణించినప్పటికీ, జమ్మూ బౌలర్ల ధాటికి 3వ రోజు ఆట ముగిసే సమయానికి 293 పరుగులకే కర్ణాటక ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం కర్ణాటక జట్టు 291 పరుగుల వెనకంజలో ఉంది. కాగా, జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే.