ఏలూరు డివిజన్ RDOగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె. లక్ష్మీ ప్రసన్న గురువారం ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది.