సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఛత్రపతి. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఆయన నటన అద్భుతం. మాయాబజార్, లవకుశ, దాన వీర శూర కర్ణ చిత్రాల్లో శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడిగా ఆయన నటన చిరస్మరణీయం. అడవి రాముడు, యమగోల, బొబ్బిలి పులి, వేటగాడు వంటి సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ కోట్ల మంది గుండెల్లో ‘అన్నగారు’గా నిలిచిపోయారు.