ఏలూరు జిల్లా ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు నిత్యం తాజా, పౌష్టిక ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం కలెక్టరేట్లో ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుమారు రూ.3,000 విలువైన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను కలెక్టర్ వెట్రిసెల్వి అందజేశారు.