కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో రాత్రి వేళల్లో విజబుల్ పోలిసింగ్ చేపట్టారు. కోసిగి సీఐ మంజునాథ్, ఎస్సై రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు ‘స్టాప్ – వాష్ అండ్ గో గురువారం’ నిర్వహించారు. అలసటతో డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని, వాహనదారులు సేదతీరి ప్రయాణించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని పోలీసులు పేర్కొన్నారు.